Home > తెలంగాణ > లోక్ సభ ఎన్నికలకు సిద్దమవుతున్న బీఆర్ఎస్.. జనవరి 3 నుంచి సన్నాహక సమావేశాలు..

లోక్ సభ ఎన్నికలకు సిద్దమవుతున్న బీఆర్ఎస్.. జనవరి 3 నుంచి సన్నాహక సమావేశాలు..

లోక్ సభ ఎన్నికలకు సిద్దమవుతున్న బీఆర్ఎస్.. జనవరి 3 నుంచి సన్నాహక సమావేశాలు..
X

లోక్ సభ ఎన్నికల కోసం సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.. జనవరి 3 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈ సమావేలు జరుగుతాయని చెప్పారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. తనతో పాటు పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనచారి, మాజీ మంత్రులు హరీశ్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సహా ముఖ్య నాయకులంతా సన్నాహక సమావేశాలను అధ్యక్షత వహిస్తారని స్పష్టం చేశారు. రెండు విడతల్లో ఈ మీటింగ్స్ జరుగుతాయన్న కేటీఆర్.. తొలి దశలో జనవరి 3 నుంచి 12 వరకు సంక్రాంతి పండుగకు మూడు రోజులు విరామమిచ్చి ఆ తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను కొనసాగిస్తామని కేటీఆర్ చెప్పారు.

నియోజకవర్గాలవారీగా సమావేశాలు జరిగే తేదీలివే..

జనవరి 3 - ఆదిలాబాద్

జనవరి 4 - కరీంనగర్

జనవరి 5 - చేవెళ్ల

జనవరి 6 - పెద్దపల్లి

జనవరి 7 - నిజామాబాద్

జనవరి 8 - జహీరాబాద్

జనవరి 9 - ఖమ్మం

జనవరి 10 - వరంగల్

జనవరి 11 - మహబూబాబాద్

జనవరి 12 - భువనగిరి

జనవరి 16 - నల్గొండ

జనవరి 17 - నాగర్ కర్నూల్

జనవరి 18 - మహబూబ్ నగర్

జనవరి 19 - మెదక్

జనవరి 20 - మల్కాజ్ గిరి

జనవరి 21 - సికింద్రాబాద్, హైదరాబాద్




Updated : 29 Dec 2023 6:03 PM IST
Tags:    
Next Story
Share it
Top