Home > తెలంగాణ > పేద మహిళకు అండగా నిలిచిన కేటీఆర్

పేద మహిళకు అండగా నిలిచిన కేటీఆర్

పేద మహిళకు అండగా నిలిచిన కేటీఆర్
X

ఓ నిరుపేద మహిళకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ మహిళ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్ కు చెందిన అన్నపూర్ణ అనే మహిళకు నర్సింగ్ చదివే ఓ కూతురు ఉంది. అయితే కూతరు నర్సింగ్ చదువుకు రూ.లక్ష రూపాయల వరకు ఫీజు అవుతోంది. కానీ నిరుపేద కుటుంబం కావడంతో ఆ ఫీజు చెల్లించేందుకు ఆమె దగ్గర డబ్బు లేకపోవడంతో హైదరాబాద్ కు వచ్చి కేటీఆర్ ను కలిసింది. ఈ క్రమంలోనే ఆమె తన గోడును కేటీఆర్ వద్ద వెళ్లబోసుకుంది. దీంతో చలించిన కేటీఆర్.. ఆమె కూతురు చదువుల కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్న చేస్తానని భరోసా కల్పించారు. కాగా ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చానని, అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలవనీయకుండా పోలీసులు బయటకు గెంటివేశారని బాధిత మహిళ అన్నపూర్ణ చెప్పింది. ఈ క్రమంలోనే తాను కేటీఆర్ ను కలిశానని, ఆయన తమ బాధను అర్థం చేసుకొని సాయం చేశారని తెలిపింది.

Updated : 24 Dec 2023 6:02 PM IST
Tags:    
Next Story
Share it
Top