చాలా పెళ్లిల్లు ఉన్నాయి.. అసెంబ్లీని వాయిదా వేయండి: స్పీకర్ కు మల్లారెడ్డి రిక్వెస్ట్ : Malla Reddy
X
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రూటే వేరు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు ఉండదు. మనసులో ఏది అనిపిస్తే అదే బయటకు అంటుంటారు మల్లారెడ్డి. తాజాగా అలాంటిదే చేశారు మల్లారెడ్డి. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన సభాపతి ప్రసాద్ కుమార్ కు ఓ వెరైటీ రిక్వెస్ట్ చేశారు. వసంత పంచమి సందర్భంగా ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయని, అందువల్ల అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులపాటు వాయిదా వేయాలని కోరారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. కాగా ఇవాళ తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యలు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రాజెక్టులు అప్పగించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయగా.. కేసీఆర్ నల్గొండ సభకు భయపడే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హరీశ్ రావు, కేటీఆర్ అన్నారు. కాగా అసెంబ్లీ రేపటికి వాయిదాపడింది.