Home > తెలంగాణ > డిల్లీలో బాధ్యతలు స్వీకరించిన మల్లు రవి

డిల్లీలో బాధ్యతలు స్వీకరించిన మల్లు రవి

డిల్లీలో బాధ్యతలు స్వీకరించిన మల్లు రవి
X

కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. డప్పు వాయిద్యాలతో ఆహ్వానం పలికారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ పనులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా ఆయన వ్యవహరించనున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తనకు ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డికి మల్లు రవి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తానని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో నిత్యం సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన 15 అంశాలపై ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారని ప్రస్తావించారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.

కాగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మల్లు రవిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. అలాగే షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డిలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఎమ్మెల్యేల కోటాలో మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీలుగా సీఎం రేవంత్ రెడ్డి సిఫారస్ చేయగా గవర్నర్ ఆమోదముద్ర తెలిపారు.

Updated : 28 Jan 2024 4:25 PM IST
Tags:    
Next Story
Share it
Top