Home > తెలంగాణ > నీ వల్ల పండుగపూట ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది.. కేటీఆర్ పై మంత్రి జూపల్లి ఫైర్

నీ వల్ల పండుగపూట ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది.. కేటీఆర్ పై మంత్రి జూపల్లి ఫైర్

నీ వల్ల పండుగపూట ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది.. కేటీఆర్ పై మంత్రి జూపల్లి ఫైర్
X

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ వల్ల పండుగ రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సివచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. పండుగ రోజున ప్రెస్‌మీట్ పెట్టాల్సిన పరిస్థితి మాజీ మంత్రి కేటీఆర్ కల్పించారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... డిసెంబర్‌లో కొల్లాపూర్‌లో మల్లేశ్ యాదవ్ అనే వ్యక్తి తన బంధువుల చేతిలో హత్యకు గురయ్యారన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల, భూ తగాదాలతో హత్య జరిగిందని తెలిపారు. ఎన్నికలు అయ్యాక ఇప్పుడు తెర మీదికి ఆ హత్యను ఎందుకు తీసుకు వచ్చారని ప్రశ్నించారు. స్థానిక నాయకులు చెప్పగానే వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక తప్పుడు కేసులు పెట్టారని, ఆధారాలతో సహా పోలీసులు, ప్రగతి భవన్ ప్రముఖులకు పంపించినా నాడు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఇక మల్లేశ్ హత్య కేసుకు సంబంధించిన హంతకులను శిక్షిస్తామమని... కొందరు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారన్నారు.

1999 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో తన మెజార్టీ పెరుగుతూ వస్తుందన్నారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పారు. మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి బీజేపీ సానుభూతి పరుడని.. కానీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కాగా నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లిలో గత డిసెంబర్ లో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త మల్లేశ్ కుటుంబాన్ని ఆదివారం కేటీఆర్ పరామర్శించారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలను బలి తీసుకోవడం సరికాదని మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు.

Updated : 15 Jan 2024 6:24 PM IST
Tags:    
Next Story
Share it
Top