Home > తెలంగాణ > ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు.. Minister Jupally

ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు.. Minister Jupally

ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు.. Minister Jupally
X

వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసమే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందుకే తాము కేఆర్ బీఎమ్ కు రాష్ట్ర ప్రాపెక్టులను అప్పగిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. తాము కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తున్నామన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, తాము ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేయబోమని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ సర్వనాశనం అయిందని అన్నారు. లక్ష కోట్ల రూపాయలు పెట్టి కడితే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి నిరూపయోగం లేకుండా పోయిందని అన్నారు. ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా దుర్వినియోగ పరిచారని మండిపడ్డారు.

ఏపీకి వెళ్తున్న నీటిని అడ్డుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ జలాలను ఏపీకి తరలించుకుపోతుంటే కేసీఆర్ ఏం చేయలేకపోయారని అన్నారు. ఎన్నికలు రానుండటంతో బీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరలేపిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హడావుడి చేసి ఎన్నికలు అయిపోగానే వాటిని పట్టించుకోకపోవడం కేసీఆర్ కు అలవాటేనని అన్నారు. దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగు భృతి వంటి ఎన్నో హామీలను ఎన్నికల ముందే కేసీఆర్ ప్రకటించారని, కానీ ఎన్నికలు ముగియగానే వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మంత్రి జూపల్లితో పాటు CWC సభ్యుడు వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, అనిరుద్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు.

Updated : 7 Feb 2024 4:03 PM IST
Tags:    
Next Story
Share it
Top