Home > తెలంగాణ > మా పార్టీ వ్యవహారాల గురించి నీకెందుకు?.. మంత్రి వెంకట్ రెడ్డి

మా పార్టీ వ్యవహారాల గురించి నీకెందుకు?.. మంత్రి వెంకట్ రెడ్డి

మా పార్టీ వ్యవహారాల గురించి నీకెందుకు?.. మంత్రి వెంకట్ రెడ్డి
X

ఈ రోజు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేత పత్రంపై జరిగిన చర్చలో మాజీ మంత్రి హరీశ్ రావుకు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. రూ.50 కోట్లు ఇచ్చి టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి పొందారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారంటూ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి వెంకట్ రెడ్డి తప్పుబట్టారు. తనపై హరీశ్ రావు తీవ్రమైన ఆరోపణలు చేశారని, అది కరెక్ట్ కాదని అన్నారు. తమ పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడాల్సిన అవసరం హరీశ్ రావుకు ఏముందని ప్రశ్నించారు. గతంలో కేటీఆర్ కూడా ఇలాగే ఆరోపణలు చేశారని అన్నారు. హరీశ్ రావు.. కేటీఆర్ మధ్య జరిగిన గొడవల గురించి కూడా తాను మాట్లాడగలనని, కానీ అది సరైన పద్ధతి కాదని అన్నారు. వేరే పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి తాను మాట్లాడబోనని అన్నారు. తమ పార్టీ తరఫున సీఎంగా రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసిందన్న మంత్రి వెంకట్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తామంతా (మంత్రులు) పని చేస్తున్నామని అన్నారు. తనకు సీఎం మధ్య పొరపొచ్చాలు వచ్చే విధంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

Updated : 20 Dec 2023 3:04 PM IST
Tags:    
Next Story
Share it
Top