Home > తెలంగాణ > ఏ ప్రాజెక్టు ఎక్కడ నిర్మించాలో కేసీఆర్ కు బాగా తెలుసు.. Niranjan Reddy

ఏ ప్రాజెక్టు ఎక్కడ నిర్మించాలో కేసీఆర్ కు బాగా తెలుసు.. Niranjan Reddy

ఏ ప్రాజెక్టు ఎక్కడ నిర్మించాలో కేసీఆర్ కు బాగా తెలుసు.. Niranjan Reddy
X

ఏ ప్రాజెక్టు ఎక్కడ నిర్మించాలో కేసీఆర్ కు బాగా తెలుసని, రాష్ట్రంపై కేసీఆర్ కు ఉన్నంత అవగాహన మరే నాయకుడికి లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో నిరంజన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని ఇంచు ఇంచు మీద కేసీఆర్ కు అవగాహన ఉందని అన్నారు. నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లించాలో ఆయనకు తెలిసినంత ఇంకెవరికీ తెలియదని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మిషన్ కాకతీయ కింద 46 వేల చెరువులను బాగు చేసుకున్నామని అన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి సమస్య లేకుండా పరిష్కరించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరం లాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టి లక్షల కొద్దీ కొత్త ఆయకట్టుకు నీరు అందించారని అన్నారు.

పులిచింత ప్రాజెక్టును అడ్డుకున్నది.. అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టుల కోసం అదే ప్రాజెక్టును మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి ముందుకు పోతుంటే అనేక అక్రమాలు కేసులు పెట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి జాప్యం కావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో నేడు రాష్ట్రం ప్రమాదంలో పడిందని అన్నారు. తొమ్మిదేళ్లుగా కేసీఆర్ కాపాడుతూ వచ్చిన కృష్ణా జలాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పచెబుతూ నిర్ణయం తీసుకుందని అన్నారు. వాళ్లిచ్చిన ఏ హామీలను కూడా అమలు చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. కేసీఆర్ కు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రాజెక్టులను అప్పజెప్పడం లేదని పేర్కొందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేస్తున్న మోసంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఇవాళ నల్గొండలో కేసీఆర్ సభ పెట్టామని అన్నారు.

Updated : 13 Feb 2024 11:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top