Home > తెలంగాణ > 100 రోజుల్లో 6 గ్యారెంటీలు తప్పక అమలు చేస్తాం.. మంత్రి పొంగులేటి

100 రోజుల్లో 6 గ్యారెంటీలు తప్పక అమలు చేస్తాం.. మంత్రి పొంగులేటి

100 రోజుల్లో 6 గ్యారెంటీలు తప్పక అమలు చేస్తాం.. మంత్రి పొంగులేటి
X

ఏదిఏమైనా 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 2 రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కార్యక్రమం ఈరోజు ప్రారంభం కాగా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోకే పాలనను తెచ్చామని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమం జనవరి 6 దాకా కొనసాగుతుందని తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలు సాధ్యం కాదని కొందరూ పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ తాము చెప్పినట్లు 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వ నడుం బిగించిందని అన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలను ప్రారంభించామని అన్నారు. మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని అన్నారు. మిగతావాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. ఆరు గ్యారెంటీల విషయంలో విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని, కానీ పథకాలను అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని అన్నారు.

Updated : 2 Jan 2024 10:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top