Home > తెలంగాణ > బండి సంజయ్ జ్యోతిష్యం ఏమైనా నేర్చుకున్నారా?.. మంత్రి పొన్నం

బండి సంజయ్ జ్యోతిష్యం ఏమైనా నేర్చుకున్నారా?.. మంత్రి పొన్నం

బండి సంజయ్ జ్యోతిష్యం ఏమైనా నేర్చుకున్నారా?.. మంత్రి పొన్నం
X

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ కు సంబంధించిన చాలా మంది ఎమ్మల్యేలు మాజీ సీఎం కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొడుతుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. ఇంటర్ ఫెయిల్ అయిన బండి సంజయ్ జ్యోతిష్యం ఎప్పుడు నేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని, ఆయన కాంగ్రెస్ పై తన అక్కసును వెళ్లగక్కారని మండిపడ్డారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒకవేళ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే టిఆర్ఎస్ పార్టీని తెలంగాణలో రెండుగా చీల్చేది బీజేపీ పార్టీ మాత్రమేనని పొన్నం కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు కొనసాగుతోందని, కావాలనే వాళ్లు కాంగ్రెస్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Updated : 15 Jan 2024 10:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top