Home > తెలంగాణ > Ponnam Prabhakar : ఆ గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు మంజూరు.. మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఆ గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు మంజూరు.. మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఆ గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు మంజూరు.. మంత్రి పొన్నం ప్రభాకర్
X

సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆ గ్రామంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం ప్రత్యేక నిధి నుంచి గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ అభియాన్ చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో జవహర్ యోజన పథకం ద్వారా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పాలకులు పంచాయతీలను పట్టించుకులేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.

సొంత డబ్బులు ఖర్చుపెట్టి గ్రామాలను అభివృద్ధి చేశారని అన్నారు. కానీ నాటి సీఎం, మంత్రులు సర్పంచుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. సర్పంచుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి అన్నారు. గత పాలకులు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని, రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఉందని అన్నారు. అయితే ఆ సమస్యను అధిగమించి ప్రజా పాలన సాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.




Updated : 27 Jan 2024 3:58 PM GMT
Tags:    
Next Story
Share it
Top