ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర.. మంత్రి సీతక్క
X
మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క ప్రకటించారు. ఆదివారం మేడారంలో పర్యటించిన సీతక్క ఈ మేరకు ప్రకటన చేశారు. 2024 ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 24 మేడారం జాతర జరుగనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహంచారు. మేడారం జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేయించిందని తెలిపారు. బడ్జెట్ తక్కువైనప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, జాతరను సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించామని తెలిపారు. తాత్కాలిక పనులు కాకుండా శాశ్వత ప్రతిపాదికన చేస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. శానిటేషన్, ట్రాఫిక్, ఆర్టీసీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలపై దృష్టి సారించామని అన్నారు. కాగా మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వడంతో నిధుల కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా జాతరను ఈసారి ఘనంగా నిర్వహించేందకు చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.