Home > తెలంగాణ > రైతు బంధుపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

రైతు బంధుపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

రైతు బంధుపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

రైతు బంధు నిధుల విడుదలపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 40 శాతం మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ చేశామని తెలిపారు. దీంతో మొత్తం 27 లక్షల మంది రైతులకు లబ్ది కలిగిందని పేర్కొన్నారు. రైతు బంధు నిధులు రోజువారీగా విడుదల చేయాలని, సోమవారం నుంచి ఎక్కువ మందికి డబ్బులు అందాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, కానీ రైతుల విషయంలో తాము ఎలాంటి కష్టమైనా పడుతామని అన్నారు. సంక్రాంతి పండుగలోపు అందరికీ రైతు బంధు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా రైతు బంధు నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తందన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

Updated : 6 Jan 2024 8:54 PM IST
Tags:    
Next Story
Share it
Top