Home > తెలంగాణ > Uttam Kumar Reddy : ప్రాజెక్టులను KRMBకి అప్పగించిందే కేసీఆర్ సర్కార్.. మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy : ప్రాజెక్టులను KRMBకి అప్పగించిందే కేసీఆర్ సర్కార్.. మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy : ప్రాజెక్టులను KRMBకి అప్పగించిందే కేసీఆర్ సర్కార్.. మంత్రి ఉత్తమ్
X

(Uttam Kumar Reddy) తెలంగాణ ప్రాజెక్టులను KRMBకి అప్పగించిందే కేసీఆర్ సర్కారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ బోర్డుకు కేసీఆర్ సర్కార్ నిధులు కూడా కేటాయించిందని అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు బడ్జెట్ లో కేసీఆర్ రూ.200 కోట్లు కేటాయించారని అన్నారు. సోమవారం సెక్రటేరియట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పజెప్పబోతోందన్న హరీశ్ రావు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన 8 టీఎంసీల నీళ్లను ఏపీకి తరలించుకుపోయేందుకు కేసీఆర్ నాడు ఏపీ సీఎం జగన్ తో కలిసి కుట్రలకు పాల్పడ్డారని అన్నారు. అందులో భాగంగానే జీవో 203 తెచ్చారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ 8 టీఎంసీలు ఏపీకి దోచుకుపోతుంటే ఏం చేశారని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ కు సహకరించేందుకే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు కేసీఆర్ పోలేదని అన్నారు. SLBC టన్నెల్ ను పదేళ్లుగా పక్కకు పెట్టారన్న ఉత్తమ్.. పాలమూరు-రంగారెడ్డి అంచనాలను పెంచి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని అన్నారు. పాలమూరు ప్రాజెక్టులు పదేళ్లలో ఏదీ పూర్తి చేయలేదని అన్నారు.

రూ.95 వేల కోట్లు ఖర్చు పెట్టినా కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి పనికి రాకుండా పోతోందని అన్నారు. కాళేశ్వరంలో ఒకటి కూలిపోయిందన్న ఆయన.. మరొకటి కూలిపోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు తాము ఎలాంటి ప్రాజెక్టులను అప్పగించడం లేదని అన్నారు. ఇందుకు సంబంధించి శాసన సభలో అన్ని విషయాలు చర్చకుపెడతామని అన్నారు. గత పదేండ్లలో జరిగిన అన్యాయం ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదని అన్నారు. కేసీఆర్ దొంగ నాటకాలను గమనించాలని రాష్ట్ర ప్రజలను మంత్రి ఉత్తమ్ కోరారు. హరీశ్ రావు లాగా పెట్రోల్ పోసుకున్నట్లు నటించడం తమకు చేతకాదన్న మంత్రి.. ఉద్యమ సమయంలోనూ బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ చేశారని అన్నారు. ఎన్నికల కోసమే బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని, వాటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.




Updated : 5 Feb 2024 2:29 PM GMT
Tags:    
Next Story
Share it
Top