Home > తెలంగాణ > సీఎం రేవంత్ను కలిసిన మాంటెక్ సింగ్ అహ్లువాలియా

సీఎం రేవంత్ను కలిసిన మాంటెక్ సింగ్ అహ్లువాలియా

సీఎం రేవంత్ను కలిసిన మాంటెక్ సింగ్ అహ్లువాలియా
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినిప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా కలుసుకున్నారు. శనివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై వారు చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, గడిచిన పదేండ్లలో భారీగా పెరిగిన అప్పులు, వాటి ప్రభావం, కాంగ్రెస్ హయాంలో దేశంలో అనుసరించిన ఆర్థిక సంస్కరణలు, వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. నిధుల సమీకరణకు అనుసరించాల్సిన విధానాలపై మాంటెక్ సింగ్ అహ్లువాలియా సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఆర్థికపరంగా తెలంగాణ ఇప్పటికే సమస్యల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన వివిధ పథకాలను అమలు చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కత్తిమీద సామే కానుంది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరం కానున్నాయి. హామీలను అమలు చేస్తూ.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోకుండా చూడటం అనేది పెద్ద సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద సవాలుగా మారింది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు రూ.1.29 లక్షల కోట్లు అవసరం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Updated : 3 Feb 2024 12:44 PM GMT
Tags:    
Next Story
Share it
Top