Home > తెలంగాణ > ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీజేపీ ఎంపీ అర్వింద్

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీజేపీ ఎంపీ అర్వింద్

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీజేపీ ఎంపీ అర్వింద్
X

రానున్న ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ ఉండనున్నట్లు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అన్ని ప్రాంతాల్లో బలపడలేదనే మాట వాస్తమేనని, కానీ

లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు జాతీయ ప్రయోజననాలను చూస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రామ మందిరంపై జోకులు వేసినోళ్లే ఇవాల పొగుడుతూ పోస్టులు పెడుతున్నారని అన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని అన్నారు. ఇక కేసీఆర్ ను గద్దె దించే అవకాశం తమకే ముందు వచ్చిందని అన్నారు. అయితే తాము ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోపోయే సరికి కాంగ్రెస్ కు లాభం కలిగిందని అన్నారు.

రాష్ట్రం అప్పులపాలు అయిందని తెలిసి కూడా కాంగ్రెస్ అన్ని హామీలు ఎట్లా ఇచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు. తాము ఇచ్చిన హామీలన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా నెరవేర్చాలని అన్నారు. ఇక కొత్త ప్రభుత్వానికి పనులు చేయడానికి కొంత సమయం ఇస్తామని.. కానీ ఆ తర్వాత పనులు చేయకపోతే నిలదీయడం తప్పదని అన్నారు. పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్న అర్వింద్.. రూ.200 కోట్లతో త్వరలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని అమిత్ షా ప్రకటించారని గుర్తు చేశారు. పసుపు బోర్డుతో ఒక్క నిజామాబాద్ కే ప్రయోజనం కాదని.. దాని వల్ల దేశం మొత్తానికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. బీడీ కార్మికుల కోసం ప్రత్యేక ఆసుపత్రిని కట్టించాలని, గల్ఫ్ వలసలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Updated : 24 Dec 2023 11:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top