Revanth Reddy : సీఎం రేవంత్ను కలిసిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు
X
సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మంగళవారం ఎమ్మెల్సీలుగా కొత్తగా ఎన్నికైన మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియామకం అయిన మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, వేణుగోపాల్, షబ్బీర్ అలీలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వారికి ఈ సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. బాగా పని చేసి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఇక తమను పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా నిలబెట్టి గెలిపించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రభుత్వ సలహాదారులకు నియమించినందుకు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, వేణుగోపాల్, షబ్బీర్ అలీలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచినందుకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. ప్రజా సంక్షేమం, పార్టీ బలోపేతం కోసం అహర్నిషలు కృషి చేస్తామని వారు సీఎంతో చెప్పారు.