Home > తెలంగాణ > సీఎం రేవంత్తో నీతి అయోగ్ వైస్ చైర్మన్ భేటీ

సీఎం రేవంత్తో నీతి అయోగ్ వైస్ చైర్మన్ భేటీ

సీఎం రేవంత్తో నీతి అయోగ్ వైస్ చైర్మన్ భేటీ
X

హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో నీతి అయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరీ, సభ్యుడు వీకే సారస్వత్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సీఎం, డిప్యూటీ సీఎం నీతి అయోగ్ అధికారులకు వివరించారు. కేంద్ర నిధుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా తమకు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. నిధులలేమితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలు కోసం నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.

కాంగ్రెస్ మేనిఫెస్టోలని 6 గ్యారెంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే రాష్ట్ర ఖజానా ఖాళీ కావడం, అప్పులు పెరిగిపోవడం, తీసుకున్న అప్పుకు మిత్త కట్టలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతు బంధు, పెన్షన్లు, ఉద్యోగుల జీతాలకు తీవ్ర ఇబ్బంది ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారెంటీలు అమలు చేయడం సమస్యగా మారింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించి తమకు రావాల్సిన కేంద్ర వాటాను వెంటనే రిలీజ్ చేయాలని ఆయనను కోరారు. అలాగే ఇంకా వేరే మార్గాల్లో కూడా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు రేవంత్ సర్కారు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో నీతి అయోగ్ వైస్ చైర్మన్ సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated : 2 Jan 2024 9:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top