అయోధ్య రామునికి హైదరాబాద్ ముత్యాల హారం
X
ఈ నెల 22న అయోధ్య రాముడు కొలువుదీరనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ రాముడికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి కానుకలు అందుతున్నాయి. ఇప్పటికే టీటీడీ శ్రీ రాముడికి లక్ష లడ్డూల ప్రసాదంగా అందించనుండగా.. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ జెవెలరీ సంస్థ అయోధ్య రాములోరికి ముత్యాల హారం కానుకగా ప్రకటించింది. హైదరాబాద్ లోని ప్రవళ జ్యువెలర్స్ అండ్ జెమ్స్ అయోధ్య రాముడికి మూడు కిలోల 600 గ్రాముల ముత్యాల హారం కానుకగా పంపనున్నట్లు తెలిపింది.
కాగా ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం ఎల్లుండి ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ వేడుకలకు రావాల్సిందిగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, వ్యాపారస్తుతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులకు శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర్ ట్రస్టు ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలోనే యూపీ ప్రభుత్వం ప్రారంభ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రముఖులు హాజరౌతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.