తెలంగాణ రైతుతో మోడీ సంభాషణ.. ఏమన్నారంటే?
X
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో గురువారం ప్రధాన మంత్రి మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తితో పీఎం మోడీ మాట్లాడారు. మల్లికార్జున్ తన ఇద్దరి కూతుళ్లతో కాన్ఫరెన్స్ కు హాజరు కాగా.. వాళ్ల పేర్లేంటని ప్రధాని అడిగారు. దాంతో యువన, అద్వైత అని ఆ చిన్నారులిద్దరూ బదులిచ్చారు. చిన్నారులిద్దరి అభివృద్ధికి మంచి సహకారం అందిస్తున్నారంటూ మల్లికార్జున్ రెడ్డిని ప్రధాని ప్రశంసించారు. సాఫ్ట్ వేర్ అయ్యిండి కూడా రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేయడం, పశుపాలన చేయడం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అంటూ మల్లికార్జున్ ను ప్రధాని పొగిడారు. అలాంటి వ్యక్తితో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. కాగా ఈ వీడియోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.