Home > తెలంగాణ > ఈ నెల 27న తెలంగాణకి ప్రియాంక గాంధీ

ఈ నెల 27న తెలంగాణకి ప్రియాంక గాంధీ

ఈ నెల 27న తెలంగాణకి ప్రియాంక గాంధీ
X

ఈ నెల 27న తెలంగాణకి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రానున్నారు. ఈ మేరకు టీపీసీసీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 27న చేవెళ్లలో జరిగే కాంగ్రెస్ సభలో ప్రియాంక గాంధీ ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తారని కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే మరో రెండు గ్యారెంటీలను ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. కాగా తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపును అమలు చేస్తోంది. ఇక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ నెల 27 నుంచి అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారంలో ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి ప్రియాంకను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే పథకాల ప్రారంభానికి ప్రియాంక గాంధీ వస్తున్నారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఇక గతేడాది డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హైదరాబాద్ కు వచ్చారు. వాళ్ల సమక్షంలోనే సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ్మ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.



Updated : 23 Feb 2024 9:49 PM IST
Tags:    
Next Story
Share it
Top