Home > తెలంగాణ > డిప్యూటీ సీఎంతో ప్రొఫెసర్ కోదండరామ్ భేటీ

డిప్యూటీ సీఎంతో ప్రొఫెసర్ కోదండరామ్ భేటీ

డిప్యూటీ సీఎంతో ప్రొఫెసర్ కోదండరామ్ భేటీ
X

రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీజేఎస్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నర్సయ్య ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు ప్రస్తుత ప్రభుత్వంకు సంబంధించిన హామీల అమలుపై కోదండరామ్ ఉప ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన నేపథ్యంలో హామీలను ఎలా అమలు చేస్తారని కోదండరామ్ భట్టిని అడిగినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారని, వాళ్ల నమ్మకాలను వమ్ము చేయవద్దని కోదండరామ్ కోరారు. ఇక తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగుల సమస్యల గురించి కూడా ఆయన డిప్యూటీ సీఎంతో చర్చించారు.




Updated : 25 Dec 2023 2:48 PM IST
Tags:    
Next Story
Share it
Top