Home > తెలంగాణ > కాంగ్రెస్ నెల రోజుల పాలనపై ప్రొ.కోదండరామ్ ఏమన్నారంటే?

కాంగ్రెస్ నెల రోజుల పాలనపై ప్రొ.కోదండరామ్ ఏమన్నారంటే?

కాంగ్రెస్ నెల రోజుల పాలనపై ప్రొ.కోదండరామ్ ఏమన్నారంటే?
X

నెల రోజుల కాంగ్రెస్ పాలనపై టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల కాంగ్రెస్ పాలన బాగుందని కొనియాడారు. కేసీఆర్ పాలనలో ప్రజలపై అనేక ఆంక్షలు ఉండేవన్న ఆయన.. కాంగ్రెస్ పాలనలో ఆ ఆంక్షలు రద్దు అయ్యాయని అన్నారు. వాట్సాప్ కాల్స్ ఆపేసి నార్మల్ కాల్స్ మాట్లాడుకునే స్థితి వచ్చిందన్నారు. ప్రాణం పోతున్నప్పుడు ఊపిరి పోసినట్లుగా కాంగ్రెస్ పాలన ఉందని అన్నారు. అందరిని కలుపుకుని పోతూ రేవంత్ రెడ్డి మంచి పాలన చేస్తున్నారని, అన్ని అంశాలపై సమీక్షలు చేస్తూ మార్పు కోసం కృషి చేస్తున్నారన్నారు. ఇక సమయానికి జీతాలు రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తి వేస్తుందని, అందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఇక కేంద్రం విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజల గురించి పట్టించుకోకుండా ప్రచారంపై దృష్టి పెట్టడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు. కాగా ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ఆయనను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారని, ఆయనకు విద్యా శాఖను కేటాయించనున్నారని వార్తలు వస్తున్నాయి.


Updated : 12 Jan 2024 3:48 PM IST
Tags:    
Next Story
Share it
Top