Home > తెలంగాణ > Prof.Kodandaram : ప్రొ.కోదండరామ్కు మంత్రి పదవి.. ఆయన ఏమన్నారంటే?

Prof.Kodandaram : ప్రొ.కోదండరామ్కు మంత్రి పదవి.. ఆయన ఏమన్నారంటే?

Prof.Kodandaram  : ప్రొ.కోదండరామ్కు మంత్రి పదవి.. ఆయన ఏమన్నారంటే?
X

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆయనకు రాష్ట్ర కేబినేట్ లో విద్యా శాఖ దక్కనుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. అదంతా వట్టి ప్రచారమేనని, ఆ విషయంలో తననెవరూ సంప్రదించలేదని ఆయన అన్నారు. తనను సంప్రదిస్తే మాత్రం ఆలోచిస్తానని అన్నారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికామని, ఈ నేపథ్యంలో తమకు రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని వారు చెప్పారని అన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి తనను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తామని అనుండొచ్చు అని అన్నారు. రాష్ట్రంలో మారినట్లుగా కేంద్రంలో కూడా ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నిరుద్యోగుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, అందుకే ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేశారని అన్నారు.




Updated : 14 Jan 2024 9:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top