Home > తెలంగాణ > కాంగ్రెస్లో చేరనున్న బీఆర్ఎస్కు ఎమ్మెల్యే?

కాంగ్రెస్లో చేరనున్న బీఆర్ఎస్కు ఎమ్మెల్యే?

కాంగ్రెస్లో చేరనున్న బీఆర్ఎస్కు ఎమ్మెల్యే?
X

రాష్ట్రంలో రాజకీయ వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరికొందరు హస్తం గూటికి చేరుకేందుకు సిద్ధమవుతున్గానారు. తాజాగా ఆ జాబితాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేరు కూడా చేరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవాళ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు.స్వామిగౌడ్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా హాజరయ్యారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. స్వామిగౌడ్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరనున్నారని, అందుకే ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ఇదే భేటీలో ప్రకాశ్ గౌడ్ కూడా ఉండటంతో ఆయన కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరడంపై ప్రకాశ్ గౌడ్ తన సన్నిహితులతో ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. అయితే తాము మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగానే కలిశామని, భేటీ సందర్భంగా తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ నడవలేదని సమావేశ అనంతరం స్వామిగౌడ్ అన్నారు. ప్రకాశ్ గౌడ్ 2009, 2014 ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఈ క్రమంలోనే 2018 ఎన్నికలతో పాటు ఇటీవల జరిగి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Updated : 18 Jan 2024 4:43 PM IST
Tags:    
Next Story
Share it
Top