Home > తెలంగాణ > రాష్ట్ర హెల్త్ డైరెక్టర్గా రవీంద్ర నాయక్

రాష్ట్ర హెల్త్ డైరెక్టర్గా రవీంద్ర నాయక్

రాష్ట్ర హెల్త్ డైరెక్టర్గా రవీంద్ర నాయక్
X

రాష్ట్రంలో ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. పలు శాఖల్లో ముఖ్య అధికారులను బదిలీ చేస్తూ వారి స్థానంలో కొత్తవారిని అపాయింట్ చేస్తోంది. తాజాగా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా కొనసాగుతున్న గడల శ్రీనివాసరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రవీంద్ర నాయక్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఇక డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యకేషన్‌గా రమేశ్‌రెడ్డి స్థానంలో త్రివేణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

కాగా ఇప్పటిదాక డీహెచ్ గా కొనసాగిన జి.శ్రీనివాసరావు తన రూటే సపరేట్ అన్నట్లు వ్యవహరించారు. ఓ ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండి పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. అప్పుడు కేసీఆర్ ఒప్పుకుంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గత ఎన్నికలకు ముందు శ్రీనివాసరావు చెప్పారు. ఇక కొత్త ప్రభుత్వంలో ఆయనకు స్థానచలనం తప్పదని అంతా అనుకున్నట్లే ఆయనను బదిలీ చేస్తూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Updated : 20 Dec 2023 8:02 PM IST
Tags:    
Next Story
Share it
Top