Home > తెలంగాణ > Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన గోద్రెజ్ కంపెనీ బృందం

Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన గోద్రెజ్ కంపెనీ బృందం

Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన గోద్రెజ్ కంపెనీ బృందం
X

సీఎం రేవంత్ రెడ్డితో గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధుల బృందం భేటీ అయింది. మంగళవారం సచివాలయంలో గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం సింగ్ యాదవ్, ఇతర కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ తో చర్చలు జరిపారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నీచర్, కన్స్యూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులకు సూచించారు. పరిశ్రమలకు అన్ని వసతులు కల్పిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. కాగా గోద్రెజ్ ఆగ్రోవెట్ తెలంగాణలో ఇప్పటికే పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు, డెయిరీ, ఆగ్రో, వెటర్నరీ సర్వీసెస్, ఆగ్రో కెమికల్స్, పశువుల దాణా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో వ్యాపారం కొనసాగిస్తోంది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటేడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ పామ్, డెయిరీ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులకు సీఎం సూచించారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.







Updated : 9 Jan 2024 10:19 PM IST
Tags:    
Next Story
Share it
Top