Home > తెలంగాణ > High Court : హైకోర్టు సీజేకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ.. ఎందుకోసమంటే?

High Court : హైకోర్టు సీజేకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ.. ఎందుకోసమంటే?

High Court : హైకోర్టు సీజేకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ.. ఎందుకోసమంటే?
X

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై పూర్తి విచారణ చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు సీజేకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డపై జ్యుడిషియల్‌ ఎంక్వైరీకి సిట్టింగ్‌ జడ్డిని కేటాయించాలని కాంగ్రెస్ సర్కార్ లేఖలో కోరింది. ఈ మేరకు రాష్ట్ర నిటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈ చర్యలు చేపట్టింది. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్ళారు. ఈఎన్సీ మురళీధర రావు ఆఫీస్‌లో కూడా అధికారులు సోదాలు చేశారు. ఆఫీసులోని రెండు, నాలుగు అంతస్థుల్లో తనిఖీలు చేశారు. మేడిగడ్డపై విజిలెన్స్‌ విచారణలో రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌, సీఏ పేర్లు ఉన్నట్లు తెలిపింది. జ్యుడిషియల్‌ విచారణ, విజిలెన్స్‌ విచారణలో ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు? ఏం చేశారు? కాంట్రాక్టు ఎలా ఫైనల్‌ అయ్యింది..? అనే అంశాలపై విచారణ చేయాలని విజిలెన్స్‌, జ్యుడిషియల్‌ ఎంక్వైరీలో తెలంగాణ ప్రభుత్వం చేర్చింది. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామని ఎన్నికల సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై త్వరలోనే జ్యిడిషియల్ విచారణ చేయిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు సీజేకు లేఖ రాసింది. కాగా తాము ఏ విచారణకైనా సిద్ధమని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావులు ఇప్పటికే ప్రకటించారు.




Updated : 9 Jan 2024 7:15 PM IST
Tags:    
Next Story
Share it
Top