Home > తెలంగాణ > RS Praveen : గురుకులాలను పట్టించుకోండి.. సీఎం రేవంత్ కు ఆర్ఎస్ ప్రవీణ్ రిక్వెస్ట్

RS Praveen : గురుకులాలను పట్టించుకోండి.. సీఎం రేవంత్ కు ఆర్ఎస్ ప్రవీణ్ రిక్వెస్ట్

RS Praveen : గురుకులాలను పట్టించుకోండి.. సీఎం రేవంత్ కు ఆర్ఎస్ ప్రవీణ్ రిక్వెస్ట్
X

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, కళాశాలలను పట్టించుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన దగ్గుపాటి వైష్ణవి కుటుంబానికి న్యాయం జరగాలని మృతురాలి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట చేపట్టిన ధర్నాలో ఆదివారం ఆర్ఎస్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతురాలు వైష్ణవి తల్లిదండ్రులు పోరాటం చేస్తోంది ఆరు గ్యారెంటీల గురించి కాదని, తన బిడ్డకు జరిగిన అన్యాయం గురించి అని అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు పూర్తయిందని కానీ గురుకులాల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇంతవరకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించలేదని, ఈ వర్గాలకు చెందిన బిడ్డల గోడు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు.

అసెంబ్లీలో అన్నీ చర్చిస్తున్నారు గానీ గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై మాత్రం చర్చించడం లేదు ఎందుకని ప్రశ్నించారు. పేద బిడ్డల ప్రాణాలకు విలువ లేదా అని నిలదీశారు. ప్రజా పాలన అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు తక్షణమే మంత్రులను నియమించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.




Updated : 11 Feb 2024 9:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top