Home > తెలంగాణ > జన్వాడ నిందితులను కఠినంగా శిక్షించాలి.. RS Praveen

జన్వాడ నిందితులను కఠినంగా శిక్షించాలి.. RS Praveen

జన్వాడ నిందితులను కఠినంగా శిక్షించాలి.. RS Praveen
X

జన్వాడలో క్రైస్తవులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. జన్వాడలో క్రైస్తవులపై జరిగిన దాడిని ఖండిస్తూ గద్వాలలో వాయిస్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన సభలో ఆర్ఎస్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్వాడలో పథకం ప్రకారం ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత మతోన్మాదులు క్రైస్తవులపై పాశవికంగా దాడి చేశారని అన్నారు. ఈ దాడులు గతంలో జరిగిన చుండూరు, కారంచేడు లాంటి ఘటనలేనని అన్నారు.

దేశంలో రామరాజ్యం పేరుతో మతోన్మాద గుండాలు క్రైస్తవులపై దాడులకు పాల్పడడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజ్యాంగంలో అధికరణ 25 ప్రకారం ప్రతి ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ ఉందని అన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక దేశంలో మత స్వేచ్ఛకు భంగం కల్గించడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయన అన్నారు.

జన్వాడ నిందితులను చట్టప్రకారం శిక్షించి మత మైనారిటీలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీల కంటే మత మైనారిటీల ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వాలన్నారు. అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించడానికి ప్రభుత్వానికి కాళేశ్వరం పిల్లర్ల పగుళ్లు గుర్తుకొస్తున్నాయి తప్ప మైనారిటీలపై దాడి గురించి మాత్రం చర్చించరని అన్నారు. ఇదేనా కాంగ్రెస ప్రజా పాలన అని ప్రశ్నించారు. దాడులు జరిగిన సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించకపోతే బాధితులకు న్యాయం ఇంకెక్కడ జరగుతుందని అన్నారు. తక్షణమే జన్వాడ నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Updated : 26 Feb 2024 6:54 PM IST
Tags:    
Next Story
Share it
Top