Home > తెలంగాణ > ఆ నియామకాలు చట్టవిరుద్ధం.. ఆర్ఎస్ ప్రవీణ్

ఆ నియామకాలు చట్టవిరుద్ధం.. ఆర్ఎస్ ప్రవీణ్

ఆ నియామకాలు చట్టవిరుద్ధం.. ఆర్ఎస్ ప్రవీణ్
X

ఆసిఫాబాద్, కొత్తగూడెం జిల్లాల జెడ్పీ చైర్మన్ల నియామకం చట్ట విరుద్ధమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ స్థానాల్లో తాత్కాలిక చైర్మన్లుగా జనరల్ కేటాగిరీకి చెందిన వ్యక్తులను ఎలా నియమిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నియామకాలకు నిరసనగా ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదురుగా జరిగిన మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్దంగా ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ ఆసిఫాబాద్ (ST-W),కొత్తగూడెం (ST-General) జిల్లా పరిషత్ చైర్మన్ల స్థానాల్లో జనరల్ కేటగిరీకి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ లు కోనేరు కృష్ణారావు, కంచర్ల చంద్రశేఖర్ రావులను ప్రభుత్వం తాత్కాలిక చైర్మన్లుగా నియమించడం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. జనరల్ కేటాగిరీకి చెందిన వ్యక్తులను ఆ పదవుల్లో కొనసాగించడమంటే రాజ్యాంగం ద్వారా ఎస్టీలకు కల్పించిన రాజకీయ హక్కులను కాలరాయడమేనని అన్నారు. ఆసిఫాబాద్,కొత్తగూడెం జిల్లాల జెడ్పీ చైర్మన్ల ఎంపిక కోసం జనవరి 10 లోపు ఎన్నికలు నిర్వహించి ఎస్టీలను ఎంపిక చేయాలని, లేనిపక్షంలో ఆదివాసీల హక్కులను కాపాడటం కోసం బీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.


Updated : 27 Dec 2023 6:36 PM IST
Tags:    
Next Story
Share it
Top