TSSP కానిస్టేబుల్ అభ్యర్థులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది.. RS Praveen
X
TSSP కానిస్టేబుల్ అభ్యర్థులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. TSSP కానిస్టేబుల్ అభ్యర్థులపై ప్రభుత్వ తీరును ఖండిస్తాన్నామని అన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏఆర్, సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ట్రైనింగ్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. TSSP కానిస్టేబుల్ అభ్యర్థులను ట్రైనింగ్ కు పిలవలేదు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థుల్లో కేవలం ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లను మాత్రమే ట్రైనింగ్ కు పిలవడం సరికాదన్నారు. దీనివల్ల SP పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 5,010 మంది అభ్యర్థులు తీవ్ర అయోమయానికి, నిరాశకు గురవుతున్నారని అన్నారు.
ఏఆర్, సివిల్ తో పాటు ట్రైనింగుకు పిలవక పోవడం వల్ల మూడు సంవత్సరాలు శ్రమించి అప్పలు పాలైన శ్రమించి అప్పుల పాలైన TSSP కానిస్టేబుల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. అలాగే వీరు తమ రెండు సంవత్సరాల సర్వీసును కోల్పోతారని అన్నారు. ట్రైనింగ్ కు పిలవకపోతే TSSP కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్వీసును ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లతో సమానంగా కౌంట్ చేస్తారా అని నిలదీశారు. TSSP కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా నేటి నుంచే స్టైపెండు/జీతం ఇస్తారా అని ప్రశ్నించారు.
పోలీస్ ట్రైనింగ్ అకాడమీలు సరిపడా లేవన్న కారణంతో TSSP కానిస్టేబుల్స్ గా ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇవ్వకపోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ప్రభుత్వం ట్రైనింగ్ అకాడమీలు సిద్ధం చేసుకోకుండా రిజల్ట్ ఇవ్వడం ఎవరి ప్రయోజనాల కోసమని అన్నారు. ఎన్నికల హంగు ఆర్భాటాల కోసమే ఇవన్నీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం అప్పుల్లో మునిగి ఉందన్న సాకుతో రెండు సంవత్సరాలు నిరుద్యోగుల నోటిలో మట్టి కొట్టే కుట్ర జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న CRPF,CISF, SPF, లేదా ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ ట్రైనింగ్ అకాడమీలతో ఒప్పందం కుదుర్చుకొని TSSP కానిస్టేబుల్స్ గా ఎంపికైన అభ్యర్థులకు కూడా సకాలంలో ట్రైనింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని అన్నారు.
ఒకే నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ ఒకేసారి శిక్షణ ఇవ్వాలని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు.