Home > తెలంగాణ > జీవో నెంబర్ 55ను వెంటనే రద్దు చేయాలి.. RS Praveen Kumar

జీవో నెంబర్ 55ను వెంటనే రద్దు చేయాలి.. RS Praveen Kumar

జీవో నెంబర్ 55ను వెంటనే రద్దు చేయాలి..  RS Praveen Kumar
X

జీవో నెంబర్ 55ను వెంటనే రద్దు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణానికి కేటాయించడాన్ని నిరసిస్తూ 12 రోజులుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు శనివారం ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచానికి అన్నం పెట్టే రైతాంగానికి నూతన వంగడాలను సృష్టిస్తున్న యూనివర్సిటీలో హైకోర్టు నిర్మాణం చేపట్టొద్దని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్తలను అందించిన వర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం చేపడితే అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతిని అరుదైన వృక్ష జాతులు, పక్షులు,జంతువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఇంకా డబ్బులుంటే వేరే చోట హైకోర్టును కట్టాలని సూచించారు. హైకోర్టు నిర్మాణానికి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఖాళీ భూములు ఉన్నాయని అన్నారు. తాము హైకోర్టు నిర్మాణానికి ఏమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. జయశంకర్ యూనివర్సిటీలో పర్యటించి విద్యార్థులు, ప్రొఫెసర్లతో చర్చలు జరిపితే అక్కడి సమస్యలు ఏంటో తెలుస్తాయని, సీఎం రేవంత్ వెంటనే యూనివర్సిటీలో పర్యటించాలని కోరారు. వర్సిటీ భూముల్లో తప్ప ఇతర ప్రభుత్వ భూముల్లో హైకోర్టు నిర్మాణం చేపట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు.

Updated : 20 Jan 2024 3:41 PM IST
Tags:    
Next Story
Share it
Top