Home > తెలంగాణ > ACB Raid రూ.10 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో

ACB Raid రూ.10 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో

ACB Raid రూ.10 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో
X

అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వాధికారులను ఎప్పటికప్పుడు దొరకబడుతూ జైల్లోకి పంపుతున్నా కొంత మంది అధికారులు తమ స్వార్ధాన్ని మాత్రం వీడటం లేదు. లంచాలకు మరిగి తమ కర్తవ్యాన్ని మరిచిపోతున్నారు. చట్టం అంటే లెక్కలేకుండా దొరికినంతా లంచాల రూపంలో దోచుకుంటున్నారు. తాజాగా షామీర్ పేట తహసీల్దార్ సత్యనారాయణ రూ.10 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు ఆయన డ్రైవర్ బద్రిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలిలో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా షామీర్పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసేందుకు తహసీల్దార్ రూ .10 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో సత్యనారాయణ డ్రైవర్ బద్రి డబ్బు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహసీల్దార్ తీసుకోమని చెబితేనే తాను డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్ ఏసీబీ అధికారులకు తెలిపారు. దీంతో తహసీల్దార్, డ్రైవర్ లను అదుపులోకి తీసుకున్నారు.

Updated : 13 Feb 2024 3:31 PM IST
Tags:    
Next Story
Share it
Top