Home > తెలంగాణ > Rythu Bandhu : ఆ రైతులకు గుడ్ న్యూస్.. పండగ తర్వాత డబ్బు జమ!

Rythu Bandhu : ఆ రైతులకు గుడ్ న్యూస్.. పండగ తర్వాత డబ్బు జమ!

Rythu Bandhu : ఆ రైతులకు గుడ్ న్యూస్.. పండగ తర్వాత డబ్బు జమ!
X

సంక్రాంతి పండగ వేళ రాష్ట్ర రైతులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతు బంధుకు సంబంధించిన కీలక అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. రాష్ట్రంలో చాలా రోజుల నుంచి రైతు బంధు డబ్బుల కోసం ఇంకా రైతులు ఎదురు చూస్తున్నారు. చాలా మందికి ఈ డబ్బులు ఇంకా అందలేదు.ఇప్పటి వరకు డబ్బు రాని రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. రైతుబంధు లబ్ధిదారులకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది. కొత్తగా అధికరంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్రాంతి పండుగ అనంతరం నిధుల కొరత సమస్య తీరనుంది.

దీని వల్ల రైతుల బ్యాంక్ ఖాతాల్లోని రైతు బంధు డబ్బులు కూడా వచ్చి చేరే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌కు మంజూరు చేసిన రూ.9 వేల కోట్ల రుణంలో కొంత త్వరలోనే లభించనుంది. నివేదికల ప్రకారం చూస్తే.. ఈ రూ.9 వేల కోట్లలో రూ.2 వేల కోట్లు ఈ నెల 16న వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ క్రమంలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు డబ్బులు పడిపోవచ్చు. కేంద్రం నుంచి డబ్బులు రాగానే ఫిబ్రవరి నెలలో రైతు బంధు లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేయడాన్ని పూర్తి చేయలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకు కేవలం రూ.1,000 కోట్ల వరకే ప్రభుత్వం రైతు బంధు నగదు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. మరో వైపు అన్నదాతలకు పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు కూడా త్వరలోనే బ్యాంక్ అకౌంట్లలో జామ కావొచ్చని తెలుస్తోంది. అంటే అదనంగా రైతులకు మరో రూ.2 వేలు రాబోతున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ 16వ విడత డబ్బులు మార్చి నెల చివరి కల్లా బ్యాంక్ అకౌంట్లలోకి రావొచ్చు. అయితే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ డబ్బులు త్వరగానే రైతుల అకౌంట్లలో పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.




Updated : 14 Jan 2024 4:03 PM GMT
Tags:    
Next Story
Share it
Top