Home > తెలంగాణ > తెలంగాణ భవన్ లో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

తెలంగాణ భవన్ లో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

తెలంగాణ భవన్ లో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు
X

తెలంగాణ భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన పలువురు బంజారా నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు. బంజారా పాటలకు నేతలతో పాటు కేటీఆర్ కూడా డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా సేవాలాల్ బంజారా జాతికి చేసిన సేవలను కేటీఆర్ కొనియాడారు. బంజారా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో సేవాలాల్ మహరాజ్ బాగా కృషి చేశారని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా ఉందని అన్నారు. ఇక బంజారా నేతల, కార్యకర్తల ఆటపాటలతో తెలంగాణ భవన్ దద్దరిల్లింది.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయుకులు పాల్గొన్నారు. కాగా బంజారా హిల్స్ లోని బంజారా భవన్ లో జరిగిన సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో సీఎం రవేంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం సేవాలాల్ జయంతి రోజును ఆఫ్షనల్ హాలిడే ఇచ్చామని అన్నారు.



Updated : 15 Feb 2024 11:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top