Home > తెలంగాణ > కేసీఆర్ను కలిసిన పలువురు ప్రముఖులు

కేసీఆర్ను కలిసిన పలువురు ప్రముఖులు

కేసీఆర్ను కలిసిన పలువురు ప్రముఖులు
X

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు శనివారం నాడు నంది నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర నాయక్, ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి, పిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి తదితర పార్టీ నేతలు కేసీఆర్ ను కలిశారు. అలాగే తాము రచించిన 'ది దక్కన్ పవర్ ప్లే' అనే పుస్తకాన్ని సీఎం మాజీ సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహారావు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ కేసీఆర్ కి అందజేశారు. అదేవిధంగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తన సోదరుడు శిరీష్ తో కలిసి కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శిరీశ్ కుమారుడి వివాహానికి రావాలంటూ ఆహ్వాన పత్రిక అందజేశారు.

కాగా కేసీఆర్ ఈ నెల 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోటి స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. తుంటి ఆపరేషన్ తర్వాత మొదటిసారి ఆయన బయటకు రావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు నెలల తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో బీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం నెలకొంది. త్వరలోనే కేసీఆర్ పూర్తిగా కోలుకుని ప్రజా జీవితంలో మునుపటిలా తిరుగుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

Updated : 3 Feb 2024 9:37 PM IST
Tags:    
Next Story
Share it
Top