అయోధ్య రాముడికి సిరిసిల్ల బంగారు చీర
X
ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీ రాముడి మందిరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రారంభ వేడుకకు ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా అయోధ్య రాముడికి సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తను చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను బహూకరించనున్నారు. ఈ నెల 26న ఈ చీరను ఆయన ప్రధాని మోడీకి అందించనుండగా.. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు. కాగా గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హరిప్రసాద్ నివాసానికి వెళ్లి చీరను పరిశీలించారు. ఈ సందర్భంగా చీరను చాలా అందంగా తయారు చేశారని నేతన్న హరిప్రసాద్ ను ఆయన ప్రశంసించారు.
చీర విశిష్టత ఏంటంటే?
నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన ఈ చీరకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను ఆ చీరలో పొందుపర్చారు. 8 గ్రాముల బంగారం,20 గ్రాముల వెండితో ఈ చీరను తయారు చేశారు. గులాబీ, లేద పసుపు రంగులో చీరను చాలా అద్భుతంగా తయారు చేశారు.