Home > తెలంగాణ > ఫ్రీ వద్దు.. టికెట్ కొంటాం.. ప్రభుత్వ మహిళా టీచర్లు

ఫ్రీ వద్దు.. టికెట్ కొంటాం.. ప్రభుత్వ మహిళా టీచర్లు

ఫ్రీ వద్దు.. టికెట్ కొంటాం.. ప్రభుత్వ మహిళా టీచర్లు
X

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ స్కీమ్.. పేద మహిళలకు వరంగా మారింది. ఇక ధనిక మహిళలు, ప్రభుత్వ మహిళా ఉద్యోగులు కూడా ఈ ఫ్రీ జర్నీని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఖమ్మం జిల్లా (డీ) వెంకటాయపాలెం జెడ్పీ స్కూల్ లోని మహిళా టీచర్లు ఇందుకు విరుద్ధంగా నిలిచారు. తమకు ఫ్రీ జర్నీ వద్దంటూ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు టికెట్లు కొంటున్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని వారే ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పారు. మంచి జీతాలతో ఉద్యోగాలు చేసేవాళ్లు టికెట్లు కొని ప్రభుత్వానికి సహకరించాలని వారు కోరారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఫ్రీగా జర్నీ చేసే అవకాశాన్ని కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పేద మహిళకు మాత్రమే ఈ స్కీమ్ వర్తించేలా ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించాలని పలువురు కోరుతున్నారు.

Updated : 17 Dec 2023 1:08 PM GMT
Tags:    
Next Story
Share it
Top