బీజేపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం
X
భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకు సంబంధించిన పలు అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన డాక్టర్ జరుప్లావత్ గోపి (కల్యాణ్ నాయక్), ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వరంగల్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, యువ మోర్చా అధ్యక్షుడిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన సెవేళ్ల మహేందర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా హైదరాబాద్ కు చెందిన ఆనంద్ గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మేడ్చల్ జిల్లాకు చెందిన డాక్టర్ శిల్ప, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పెద్దొళ్ల గంగారెడ్డిలను నియమిస్తూ కిషన్ రెడ్డి ఉతర్వులు జారీ చేశారు. అలాగే 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించగా.. అందులో 12 మందికి కొత్తగా అవకాశం కల్పించారు.