Home > తెలంగాణ > కేంద్రంతో లాలూచీ పడి ప్రాజెక్ట్లను అప్పగించారు.. Jagadish Reddy

కేంద్రంతో లాలూచీ పడి ప్రాజెక్ట్లను అప్పగించారు.. Jagadish Reddy

కేంద్రంతో లాలూచీ పడి ప్రాజెక్ట్లను అప్పగించారు.. Jagadish Reddy
X

తెలంగాణలో ఇరిగేషన్ శాఖను కేసీఆర్ సర్వనాశనం చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఖండించారు. తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి తమ నేత కేసీఆర్ పై ఎదురు దాడి చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచీ పడి ప్రాజెక్ట్ లను అప్పగించారని అన్నారు. కృష్ణా జలాల విషయంలో ప్రాజెక్ట్ లు అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. కేంద్రానికి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్ట్ లను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభత్వాన్ని ప్రజలు చెప్పు దెబ్బలు కొడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరాక కేసీఆర్ ఒక్క మాట కూడా వారి గురించి మాట్లాడలేదని, కేసీఆర్ ఏం మాట్లాడక ముందే కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణకు అసలైన ద్రోహులు కాంగ్రెస్ నేతలేనని అన్నారు. కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామన్న జగదీశ్ రెడ్డి.. ఎవరు ద్రోహులో అక్కడే తేల్చుకుందామని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడే ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు తీరని అన్యాయం చేశాయని అన్నారు. ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకొని కృష్ణా జలాల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని అన్నారు. దీంతో ఐదు జిల్లాలకు తీరని అన్యాయం జరగనుందని అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా వేదికల మీద నిలదీస్తామని అన్నారు.

Updated : 4 Feb 2024 1:53 PM GMT
Tags:    
Next Story
Share it
Top