Home > తెలంగాణ > Telangana Assembly : ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly : ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly : ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
X

తెలంగాణ శాసనసభా సమావేశాలు ముగిశాయి. సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ రెండో సెషన్ సమావేశాలు ఫిబ్రవరి 8న ప్రారంభమై ఫిబ్రవరి 17న ముగిశాయని స్పీకర్ పేర్కొన్నారు. మొత్తం 8 రోజుల పాటు సభ నిర్వహించినట్లు వెల్లడించారు. మొత్తం పని గంటలు 45 గంటలు 32 నిమిషాలుగా పేర్కొన్నారు. సభలో మొత్తం 59 మంది మాట్లాడినట్లు తెలిపారు. అలాగే జీరో అవర్ లో 64 ప్రసంగాలు అయినట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపిందని, అలాగే రెండు తీర్మానాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అదేవిధంగా ఒక షార్ట్ డిస్కషన్ నడిచిందని, ఇక అసెంబ్లీలో బలాబలాల కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, సీపీఐ 1, బీజేపీ 8, ఎంఐఎం 7 ఉన్నట్లు స్పీకర్ తెలిపారు. కాగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టగా దానిపై దీర్ఘంగా చర్చ నడిచింది. ఇక ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగునీటి శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ నడిచింది.

Updated : 17 Feb 2024 8:37 PM IST
Tags:    
Next Story
Share it
Top