Home > తెలంగాణ > రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్
X

ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఢిల్లీకి బయలుదేరివెళ్లనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4.30కు ప్రధాని మోడీతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే విషయంపై కూడా వారు ప్రధానితో చర్చించనున్నారు. ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే చాలా నిధుల కావాల్సిన నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రధాని మోడీని కలవనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్ తో పాటు ఇతర ముఖ్య నేతలను కూడా తమ ఢిల్లీ టూర్ లో భాగంగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కలవనున్నట్లు తెలుస్తోంది.


Updated : 25 Dec 2023 6:46 PM IST
Tags:    
Next Story
Share it
Top