Minister Ponguleti Srinivas Reddy : జూనియర్ ఎన్టీఆర్ను కలిసిన మంత్రి పొంగులేటి.. ఎందుకో తెలుసా?
X
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇంకో మూడు నెలల్లో తెలంగాణలో పార్లమెంట్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టేశాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఇది ఇలా ఉంటే తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం జూనియర్ ఎన్టీఆర్ ని కలిశారు. అయితే మంత్రి జూనియర్ ఎన్టీఆర్ ను కలిసింది రాజకీయాల గురించి అనుకుంటే పప్పులో కాలేసినట్లే. విషయంలోకి వెళ్తే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా పాన్ ఇండియా స్టార్, యంగ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దంపతులని కలిశారు. ఈ సందర్భంగా తన సోదరుడు ప్రసాద్ రెడ్డి తనయుడు లోహిత్ రెడ్డి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రి అందజేశారు. వివాహానికి తప్పకుండా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఎన్టీఆర్ దంపతులను కోరారు. తర్వాత ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కూడా కలిసి వివాహా ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం వారిని కలిసిన ఫోటోలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.