Home > తెలంగాణ > జాతీయ క్రీడా పురస్కార గ్రహీతలు వీళ్లే

జాతీయ క్రీడా పురస్కార గ్రహీతలు వీళ్లే

జాతీయ క్రీడా పురస్కార గ్రహీతలు వీళ్లే
X

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది (2023)కి గానూ జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. బ్యాడ్మింటన్లో అద్భుతంగా రాణించిన చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి- రాంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్ జోడీ క్రీడల్లో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న' అవార్డుకు ఎంపికైంది. రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డుకు వివిధ క్రీడల నుంచి మొత్తం 26 మంది ఆటగాళ్లు ఎంపికయ్యారు.

అర్జున అవార్డు గ్రహీతలు

ఓజస్ ప్రవీణ్(ఆర్చరీ), అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ) శ్రీశంకర్ (అథ్లెటిక్స్), పరుల్ చౌదరి(అథ్లెటిక్స్), మహ్మద్ హుసాముద్దీన్ (బాక్సింగ్), ఆర్ వైశాలి(చెస్), మహ్మద్ షమీ(క్రికెట్), అనుష్ అగర్వాలా(గుర్రపు స్వారీ), దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్), దీక్షా దాగర్(గోల్ఫ్), కృష్ణ బహదూర్ పాఠక్(హాకీ), సుశీల చాను(హాకీ), పవన్ కుమార్(కబడ్డీ), రీతు నేగి(కబడ్డీ), నస్రీన్(ఖో-ఖో), పింకీ(లాన్ బౌల్స్), ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్), ఈషా సింగ్(షూటింగ్), హరీందర్ పాల్(స్క్వాష్), అహికా ముఖర్జీ(టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్(రెజ్లింగ్), అంతిమ్(రెజ్లింగ్), రోషిబినా దేవి(వుషు), శీతల్ దేవి(పారా ఆర్చరీ), అజయ్ కుమార్ రెడ్డి(బ్లైండ్ క్రికెట్), ప్రాచీ యాదవ్(పారా కానోయింగ్)

ఖేల్ రత్న, అర్జున అవార్డులతోపాటు ఆటగాళ్లను తీర్చిదిద్దిన ఉత్తమ కోచ్లకు ద్రోణాచార్య పురస్కారాలనూ కేంద్రం ప్రకటించింది. రెగ్యులర్ కేటగిరీలో అవార్డులు పొందిన వారిలో లలిత్ కుమార్(రెజ్లింగ్), ఆర్బీ రమేష్ (చెస్), మహావీర్ ప్రసాద్ సైనీ(పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్(హాకీ), గణేష్ ప్రభాకర్(మల్లఖాంబ్) ఉన్నారు.

ద్రోణాచార్య పురస్కారంలైఫ్ టైమ్ కేటగిరీ: జస్కిరత్ సింగ్(గోల్ఫ్), భాస్కరణ్(కబడ్డీ), జయంత కుమార్(టేబుల్ టెన్నిస్)

జీవితకాల సాఫల్య పురస్కారం: మంజుష కన్వార్ (బ్యాడ్మింటన్), వినీత్ కుమార్ (హాకీ), కవిత సెల్వరాజ్ (కబడ్డీ).

Updated : 20 Dec 2023 4:30 PM GMT
Tags:    
Next Story
Share it
Top