టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలి.. డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్
X
టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని డీఎస్సీ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. టెట్ తర్వాతే టీచర్ పోస్టులు పెంచి మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు కోరుతున్నారు. టెట్ నోటిఫికేషన్ కోసం 2 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. కాగా NCTE నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించి ఇప్పటికీ 8 నెలలు పూర్తి అయ్యింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ నిర్వహించకుండా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్దం అవుతున్న నేపథ్యంలో డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే టెట్ పరీక్ష నిర్వహించి వెంటనే 15వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు దగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తుందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఇందుకోసమేనా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది అని వారు మండిపడుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం వేస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కూడా 6వేలకు పెంచి ఎస్జీటీ అవకాశం బీఎడ్ అభ్యర్థులకు లేనందున బీఈడీ అభ్యర్థులకు పోస్టులు పెంచి ప్రభుత్వం న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 8 సంవత్సరాలు ఓపిక పట్టాం...చాలీచాలని పోస్టులతో వేసే డీఎస్సీ తమకు వద్దు అని అభ్యర్థుల ఆందోళన ప్రభుత్వం మూతపడిన స్కూల్స్ అన్ని ఓపెన్ చేస్తామని ప్రకటించి ఇప్పుడు 11వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వేయడం సమంజసం కాదని, వెంటనే ప్రభుత్వం టెట్ నిర్వహించి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.