Home > తెలంగాణ > నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభంపై కమిటీ ఏర్పాటు

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభంపై కమిటీ ఏర్పాటు

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభంపై కమిటీ ఏర్పాటు
X

నిజాం చక్కెర ఫ్యాక్టరీ పునః ప్రారంభం పై సిఫారసులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పరిశ్రమ ల శాఖా మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కో చైర్మన్ గా ఉంటారు. ఇక కమిటీ మెంబర్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఈ కమిటీలో మెంబర్లుగా ఉంటారు. అలాగే నిజాం షుగర్ లిమిటెడ్ డైరెక్టర్ ఈ కమిటీలో మెంబర్ కన్వీనర్ గా ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించేందుకు ఈ కమిటీ బ్యాంకింగ్, ఇతర నిపుణుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించింది. ఈ విషయంలో నిజాం షుగర్ డైరెక్టర్ ఏర్పాట్లు చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాగా కమిటీలో మెంబర్ గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తే చక్కర సాగు రైతులకు రవాణా భారం తగ్గి, గిట్టుబాటు అవుతుందని అన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు అన్ని చేపట్టాలని కోరారు.



Updated : 29 Jan 2024 11:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top