పోలీస్ ఇంట్లో చోరీ
X
చోరీలకు పాల్పడే దొంగలను పట్టుకునే పోలీస్ ఇంట్లోనే దొంగలు పడ్డారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన ఖమ్మంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం బెటాలియన్ లో లక్ష్మణరావు అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్నాడు. ఆయన అదే మండలం బేతవల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే మంగళవారం రాత్రి ఓ వివాహా కార్యక్రమానికి హాజరైన ఆయన.. రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాక తీరా చూస్తే ఇంటి కిటికీ తెరిచి ఉంది. ఆ కిటికీలో నుంచి దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. బంగారు, వెండి నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే ఇంట్లో దాచిన రూ.25 వేల నగదును కూడా అపహరించారు. ఇక బంగారం విలువ రూ.12 లక్షల వరకు ఉంటుందని బాధితుడు లబోదిబోఅన్నాడు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.