Home > తెలంగాణ > కేసీఆర్ కు టీజేఎస్ బహిరంగ లేఖ

కేసీఆర్ కు టీజేఎస్ బహిరంగ లేఖ

కేసీఆర్ కు టీజేఎస్ బహిరంగ లేఖ
X

తెలంగాణ మాజీ సీఎం రేపు నల్గొండ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో టీజేఎస్ ఆయనకు బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖలో కేసీఆర్ కు పలు ప్రశ్నలు సంధించారు.

కృష్ణా జలాల పరిరక్షణ కోసం అంటూ నల్లగొండకు వస్తున్న తొలి తెలంగాణ దశాబ్ద కాల బీఆర్ఎస్ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మీరు కృష్ణా జలాలపై మాట్లాడే ముందు లేదా ఆ పేరుతో పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జరుపదల్చుకున్న బహిరంగ సభకు వచ్చే ముందు క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ టీజేఎస్ చేసింది.

కేసీఆర్ కు టీజేఎస్ సంధించిన ప్రశ్నలు ఇవే

..కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులన్నింటినీ నది యాజమాన్య బోర్డులకు అప్పగించాలని 15 జులై 2021న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు?

..ప్రాజెక్టుల నిర్వహణకు ఆయా యాజమాన్య బోర్డులకు రూ.200 కోట్లు చెల్లించాలని పెట్టిన డిమాండ్ కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు జరిపింది వాస్తవం కాదా?

..ఈ గెజిట్ మూలంగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు బోర్డు ఆధీనంలోకి వెళ్లి నీటి కేటాయింపుల నుండి నిర్వహణ, కనీస రిపేర్ల వరకు, విద్యుత్ ఉత్పత్తితో సహా బోర్డుకు సర్వాధికారాలు ఉంటాయని తెలిసి కూడా ఆనాడు మీరు నోరు విప్పకుండా, ఇప్పుడు హడావిడిగా కృత్రిమ ఉద్యమానికి ఆయాస పడుతున్న దానిని ఏలా చూడాలి?

..భారత రాజ్యాంగం ప్రకారం నీరు రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం లాగేసుకుంటుంటే, ఫెడరల్

స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటే, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంటే ఉన్నత న్యాయస్థానంను ఆశ్రయించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు ?

..కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా తేల్చకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాన్చుతూ ఉంటే సత్వర న్యాయం కోసం ఎందుకు కేంద్రంపై ఒత్తిడి చేయలేదు?

..గెజిట్ నోటిఫికేషన్ లో రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు ఆరు మాసాలలో అనుమతులు సాదించుకోవాలని,

లేనట్లయితే నోటిఫికేషన్ అమలులోకి వచ్చిన రోజునే పనులు ఆపివేయాలని చెప్పింది. మరి మీరు కృష్ణా నదిలో నీటిని

వినియోగం చేసుకోవడానికి ఎన్ని ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఎన్ని ప్రాజెక్టులకు అనుమతులు సాధించారు.?

..మీ కాంట్రాక్టు కమీషన్ల కోసం అశాస్త్రీయంగా అంచనాలు పెంచి నిర్మాణం రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల సాగ దీస్తున్నారుతప్పు ఇంకా ఏమైనా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశారా?

..ఈ గెజిట్ అమలులోకి వస్తే ప్రాజెక్టు నిర్మాణాలు ఆగిపోయి, వాటి కోసం వాడు మీ ప్రభుత్వం తీసుకున్న రుణాలు వడ్డీతో సహా చెల్లించడం భారమని తెలిసి కూడా ఎందుకు కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చారు? ఎందుకు లక్షల ఎకరాల భూమిని బలవంతంగా సేకరించారు?

..మీరు కేంద్రం అడుగులకు మడుగులు వత్తుతూ నోట్ల రద్దు, జీఎస్టీ వంటి బిల్లులకు మద్దతుగా ఆఘమేఘాల మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానాలు చేసిన మీరు, ఈ అప్రజాస్వామిక బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయలేదు?

..మీ కూతురు కవిత లిక్కర్ ఉందా కేసులో కేంద్రంతో రాజీ పడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వాస్తవం కాదా?

..నల్లగొండ మీద నేడు మొసలి కన్నీళ్లు కారుస్తున్న మీరు, ఎస్సెల్బీసీ ఎడమ కాలువకు సొరంగం తవ్వకానికి మీ పదేండ్ల ఏలుబడిలో ఎందుకు నిధులు కేటాయించలేదు? నిర్మాణ పనులు ఎందుకు పూర్తి చేయలేదు?

..ప్రపంచ అద్భుతాన్ని సృష్టించామని కాళేశ్వరం గురించి గొప్పలుపోతున్న మీరు దక్షణ తెలంగాణను నిర్లక్ష్యం చేసింది వాస్తవం కాదా ?

..మీ రాజకీయ ఎదుగుదలకు తెలంగాణ నినాదాన్ని నిచ్చెనలా వాడుకొని, అధికారం దక్కగానే మీ అధికార దాహం కోసం బీఆర్ఎస్ పేరుతో దేశం మీద పడి బేసిన్లు లేవు, బేషజాలు లేవు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తా అంటూ తెలంగాణ తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన మీకు తెలంగాణ పేరు ఉచ్చరించే నైతిక అర్హత ఉన్నదా ?

పై ప్రశ్నలన్నింటికీ బహిరంగంగా ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతన మీరు నల్లగొండకు రావాలని డిమాండ్ చేస్తున్నాం.

తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, రాష్ట్ర కార్యాలయం, నాంపల్లి, హైదరాబాద్

Updated : 12 Feb 2024 9:36 PM IST
Tags:    
Next Story
Share it
Top