Home > తెలంగాణ > ఎలాంటి సిద్ధాంతాలు లేని పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్.. జగ్గారెడ్డి

ఎలాంటి సిద్ధాంతాలు లేని పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్.. జగ్గారెడ్డి

ఎలాంటి సిద్ధాంతాలు లేని పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్.. జగ్గారెడ్డి
X

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఎలాంటి సిద్ధాంతాలు లేని పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ అంటూ విమర్శలు చేశారు. గాంధీభవన్ లో మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తాయని అన్నారు. కానీ సెక్యులర్ మాట చెప్పి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. బీజేపీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ మాటలకు విలువలేదని అన్నారు. గతంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసే దాక ఈడీ అధికారులు వెళ్లారని, కానీ ఆ తర్వాత ఆ కేసు నీరుగారిందని అన్నారు. అప్పుడే బీజేపీలో బండి సంజయ్ కి ఏమాత్రం విలువ లేదని అర్థమైందని అన్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు కొనసాగుతోందని అన్నారు. కానీ బండి సంజయ్ బీజేపీ, బీఆర్ఎస్ కు పొత్తు ఉన్నదనే వ్యక్తిని చెప్పుతో కొట్టండంటూ డ్రామాలాడారని అన్నారు.

ఇక తాజాగా కవితపై సీబీఐ కేసు నమోదు చేయడం వెనుక బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పెద్ద ఒప్పందమే జరిగిందని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో బీఆర్ఎస్ ను గెలిపించేందుకు బీజేపీ ఇండైరెక్టుగా సపోర్టు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చి బీఆర్ఎస్ కు మేలు చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని అన్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే కవితను సీబీఐ అరెస్ట్ చేయనుందని కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు. ప్రజల నుంచి సానుభూతి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ ఈ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ గాంధీని ప్రధాని కానీయవద్దనే లక్ష్యంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయని అన్నారు. వారు ఎన్ని కుట్రలు చేసిన రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనుకున్న సమయంలోనే అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు.



Updated : 25 Feb 2024 9:53 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top